అక్రిడేషన్ + అడ్వటైజ్మెంట్స్ = ఆదాయం
◼️ *|| అక్రిడేషన్ + అడ్వటైజ్మెంట్స్ = ఆదాయం ||* ◼️
*ఆంధ్రా, తెలంగాణ:*
జర్నలిస్టు: మాకోటి మహేష్
" అంగట్లో అక్రిడేషన్ " ... పాత్రికేయ రంగం పతనావస్థ ... " పైసమే పరమాత్మ "
" పాత్రికేయ గుట్టు ... పిడిఎఫ్ రట్టు "
*" ఒక్క , ఒక్క లోగో ఐదు వందలతో పోలుస్తూ ప్రతి రోజు వార్తలు "*
*▪️ఎటువంటి అర్హత లేని వ్యక్తులు కూడా ప్రభుత్వ ఆక్రిడేషన్ తో షో.*
*▪️ఓ జిల్లాలో అయితే మెకానిక్ కు ఆక్రిడేషన్ అంట ... " ఇలా తెలుగు కూడా సరిగా రాని వారు కూడా ఆక్రిడేషన్ తో ఆటలు "*
▪️సంబంధిత రిపోర్టర్ నోట్ అని పెట్టి. " యాడ్ ఇస్తానని అన్నారు ... కనుక ఈ రెండు ఫోటోలు వాడండి " అని రాసిన మాటలను కూడా అది వార్తకు హెడ్డింగ్ పెట్టిన డెస్క్ మహనీయులకు జోహార్లు.
▪️ధన దాహం తప్ప సమాజ హితం మరిచి డబ్బుల యావ ఎక్కువైపోయేసరికి జర్నలిజం విలువలు పడిపోతున్నాయి.
▪️పిండి కొద్ది రొట్టె అన్నట్లు ... చాలా పత్రికల్లో క్వాలిఫైడ్ అనుభవం గల రిపోర్టింగ్ వ్యవస్థ ... గేట్ కీపింగ్ టీము(సబ్ ఎడిటర్లు ఎడిషన్ ఇంచార్జీలు ) పూర్తిగా మాయమైపోయింది.
▪️చదవడం రాయడం వస్తే చాలు అటువంటి వారిని ఎంపిక చేసుకొని అరకొర జీతం ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకుంటున్నారు.
▪️విషయంతో సంబంధం లేకుండా వారికి కళ్ళ కనపడిందే పేజినేషన్ చేసి ప్రింట్ కి ఇచ్చేస్తున్నారు.
▪️దీనికి తోడు చదువు సంధ్య లేని కొందరు ప్రభుత్వ అక్రిడిటేషన్ కార్డు కోసం కొన్ని మీడియా యాజమాన్యాలకు ఎదురు డబ్బిచ్చి విలేకరులుగా సమాజంలో కనబడుతున్నారు.