బొలెరో బోల్తా.. ఐదుగురు మృతి, 20 మందికి గాయాలు*
జర్నలిస్టు : మాకోటి మహేష్
అల్లూరి జిల్లా
అనంతగిరి మండలం తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం.
క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా తెలుస్తోంది.
కూలి పనుల కోసం అరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.