logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

యువత సంక్షేమమే లక్ష్యంగా జనసేన పార్టీ కృషి

మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 14/03/2026:
యువత సంక్షేమం, యువత రాజకీయ రంగప్రవేశం చేసి అన్ని రంగాల్లో రాణించాలన్న లక్ష్యంతో ఏర్పడిన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరిని నేడు నేరుగా కలిసి జనసేన జెండా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ్ తల్లూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మండల, బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రోజు గ్రామపంచాయతీ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు.
జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంగం అజయ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ అధినాయకత్వం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.

4
488 views

Comment