సాలూరు లో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం
జనసేన పార్టీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కొణిదెల పవన్ కళ్యాణ్ 2014లో సమ సమాజ స్థాపన లక్ష్యంగా స్థాపించారు. జనసేన అనగా ప్రజా సైన్యం అని అర్థం. 2014 సంవత్సరంలో ఒంటరిగా బరిలోకి దిగకుండా వేరే పార్టీకి మద్దతు ఇచ్చింది 2019లో నేరుగా పోటీ చేసినా కేవలం ఒక్క సీటు కే పరిమితం అయింది. అయినా పట్టు సడలని విశ్వాసంతో 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి టిడిపి లతో జనసేన కూటమి పోటీ చేసి 21సీట్లకు 21సాధించి 100 శాతం సాధించి రికార్డు సృష్టించింది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి... ఎన్ని ఓటములు ఎదురైనా మరెన్నో ఇబ్బందులకు గురైనా... తట్టుకోని నిలబడి ప్రజల నమ్మకాన్ని సంపాదించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారు.
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరజాపు వీధిలో మన జనసేన పార్టీ కార్యాలయం లో జనసేన నాయకులు, జన సైనికులు, అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా కేక్ కటింగ్, జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జరజాపు సూరి బాబు, రాపాక మాధవరావు, జిటి నాయుడు, అవ్వా సంతోష్, గరికపాటి సంతోష్, బోను మహంతి శ్రీను, బాలాజీ స్టూడియో పిల్లా మురళి, సుంకర గోపి, పరశురాం, ఆర్ .ఎస్. ఎన్ ఇంకా యువత అధిక సంఖ్యలో హాజరయ్యారు