logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బీసీవై పార్టీ: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఏకీకరణకు సంకల్పం

నెల్లూరు నగరంలోని డాక్టర్ మారం సుధాకర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఈరోజు బీసీవై పార్టీలో మహిళల భారీ చేరిక కార్యక్రమం జరిగింది.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం, వెంగల్ రావు నగర్ బి బ్లాక్ 33వ డివిజన్ నుంచి అనేక మహిళలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో బుధవరపు బాలాజీ, జిల్లా అధ్యక్షులు పాల్గొని, వెంకటరమణ గారిని రూరల్ మండల అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ బాధ్యతలు అప్పగించడం జరిగింది.
బాలాజీ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో బీసీవై పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరూ పార్టీ బలోపేతం కోసం సిద్ధంగా ఉండాలని ఆకాంక్షించారు.
అలాగే, జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ రాష్ట్రవ్యాప్తంగా తిరిగి, బహుజన సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని హామీ ఇచ్చారని తెలిపారు.
మండల అధ్యక్షులుగా నియమితులు తమ పరిధిలోని గ్రామ కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి, బహుజనులను ముందుకు తీసుకెళ్లే పని ప్రారంభించాలని బాలాజీ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ఎస్ఎస్ యాదవ్, డాక్టర్ గుంజి నరసింహారావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సోమ గోపాల్, అరుణాచలం సెల్వం, వల్లెపు వెంకటరత్నం, రాకాటి బాబు, సెల్వం ఇందిరా, రాపూర్ లక్ష్మి, SK షబానా తదితరులు పాల్గొన్నారు.

0
0 views

Comment