*శ్రీ సీతా రామాంజనేయ రాజగోపుర శిఖర ప్రతిష్ఠా కార్యక్రమము*
తేదీ: 14-03-2026- శేరిలింగంపల్లి చందానగర్ :ఈరోజు శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల హుడా ట్రేడ్ సెంటర్ శ్రీ సీతా రామాంజనేయ స్వామి వార్ల దేవస్థానమునందు ఉదయము గం. 7.30 ని. లకు ప్రధాన కలశ సహిత చతుష్ఠాన అర్చన, గణపతి, చండీ, మహాలింగార్చన, సుందరకాండ, సూర్య నమస్కార పారాయణ సహిత ప్రధాన దేవతా హోమములను నిర్వహించారు. తదనంతరం ఉదయము గం. 9.06 ని. లకు ఉత్తరాషాఢ నక్షత్ర యుక్త మేషలగ్న శుభ పుష్కరాంశమందు రాజగోపుర శిఖర ప్రతిష్ఠా కార్యక్రమములు, మహా పూర్ణాహుతి, అష్టోత్తర శతకలశ మహా కుంభాభిషేకం, వేద ఆశీర్వచనము నిర్వహించారు. ఋత్విక్ వరేణ్యులకు పండిత సత్కార సన్మాన కార్యక్రమములు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ మూర్తులకు లక్షపుష్పార్చన, నీరాజన మంత్రపుష్పముల అర్చన, తదనంతరం తీర్థ, ప్రసాదముల వినియమం చేశారు. బ్రహ్మశ్రీ కన్నేపల్లి శివ రామచంద్రమూర్తి గురువుగారి పర్యవేక్షణలో వేదవిదులైన బ్రాహ్మణోత్తములచే ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు, గౌరవ ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, కాలనీ వాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.