logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు అనభేరి ప్రభాకర్ రావు 78 వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక


తేదీ 14-03-2026 శనివారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు లో ఉన్న అమర వీరుల స్తూపం వద్ద తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు తెలంగాణ షేర్ అనభేరి ప్రభాకర్ రావు దేశ్ముఖ్ గారి 78 వ వర్ధంతి సందర్భంగా ప్రభాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, బీసీ సంఘాల నాయకుడు గజెల్లి వెంకటయ్య. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ అన్నదాతకు ప్రాణదాత , నేతన్నకు బతుకు బాట, పేదోడికి దేవుడయ్య, ఉద్యమానికి ఊపిరయ్య, ఆడపడుచుల ఆత్మ గౌరవం, తెలంగాణ వీర కిశోరం అని, ప్రభాకర్ రావు మరణం తెలంగాణ ప్రజనికానికి తీవ్ర లోటని పేర్కొన్నారు. అదే విధంగా అనభేరీ ప్రభాకర్ రావు దేశ్ముఖ్ గారి విగ్రహాన్ని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని , ప్రభాకర్ రావు గారి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట వీరుడు అనభేరి ప్రభాకర్ రావు కి జోహార్లు అని నినాదాలు చేసినారు,

8
266 views
1 shares

Comment