logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నంద్యాల (AIMA MEDIA ): జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సమన్వయకర్త పిడతల సుధాకర్, జనసేన నాయకులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి రవి, సుధా మోహన్ రెడ్డి, సింహాసనం నగేష్ , సురేష్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి జనసేన నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త పిడతల సుధాకర్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం తమకెంతో పండుగరోజనీ 13 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక్కడిగా మొదలై నేడు ఆయన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు తోడుగా ఉంటూ ఆయనను తాము డిప్యూటీ సీఎంగా చూడడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ప్రజా శ్రేయస్సు కొరకు, నిరంతరం ప్రజల సమస్యలను తీర్చే తమ అభిమాన నటుడుకి, నాయకునికి ఒక అభిమానిగా ఉండడం తమ అదృష్టమన్నారు.తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నాడన్నారు. ఎన్నో గ్రామాలలో రోడ్లు వేస్తూ గ్రామాలను అభివృద్ధి బాటపై నడిపిస్తున్న తమ నాయకుడికి ఎప్పుడు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ్ శీను, రెడ్ రోజు కృష్ణ, వెంకటేష్, శంకర్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

0
58 views

Comment