logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Pawan Kalyan ప్రారంభించిన జనసేన ఉద్యమం ప్రజల కోసం నిరంతర పోరాటం – కిషోర్ గునుకుల

ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి Pawan Kalyan గారు ప్రారంభించిన సామాజిక ఉద్యమమే Jana Sena Party.
జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల గారు మాట్లాడుతూ…
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి, రాష్ట్ర టిడ్కో చైర్మన్ Vemulapati Ajaya Kumar గారి ఆధ్వర్యంలో అన్ని విభాగాల కార్యకర్తలను సమీకరించి పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
గత 13 సంవత్సరాలుగా అనేక ఒత్తిడులు, విమర్శలు, బెదిరింపులను లెక్క చేయకుండా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ… కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా తక్కువ కాలంలోనే సమాజం మరచిపోయిన అనేక సున్నితమైన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతూ గొప్ప నాయకుడిగా Pawan Kalyan గారు నిలుస్తున్నారని తెలిపారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, జనసైనికులు అందరూ అదే స్పూర్తితో ప్రజల మధ్య ఉండి సేవ చేయాలని ఆయన కోరారు.
“నిజాయితీతో కూడిన రాజకీయాలు – సమాజ మార్పు కోసం పోరాటం” అనే లక్ష్యంతో ప్రారంభమైన Jana Sena Party ఉద్యమం భవిష్యత్తులో మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ…
జనసేన పార్టీకి 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ✊🔥

22
1183 views

Comment