రోలుగుంట మసీదులో భక్తిశ్రద్ధలతో రంజాన్ ఉపవాసాలు.. ప్రత్యేక నమాజులు
అనకాపల్లి జిల్లా రోలుగుంట మజీద్ అల్ పిరిదోష్ మసీదులో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ముస్లింలు నెలరోజులు ఉపవాస దీక్షలో పాల్గొంటున్నారు. బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు.సూర్యోదయానికి ముందు సహరీ చేసి, ఐదు పూటల నమాజులు చేస్తూ, సాయంత్రం ఇఫ్తార్ తర్వాత ప్రత్యేక నమాజులు.. రాత్రి 20 రకాతుల తరావీహ్ నమాజులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని ఆయన తెలిపారు.మసీద్ అధ్యక్షుడు హిమామ్ మాట్లాడుతూ, రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన 9వ నెల. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు భక్తి, ప్రార్థన, దానధర్మాలతో జరుపుకుంటామని చెప్పారు.కార్యక్రమంలో సెక్రటరీ సత్తార్, వైస్ ప్రెసిడెంట్ మస్తాన్ హుస్సేన్ జిలాని, నాగూరు సుభాను, సతారు అబ్దుల్లా, సలీం షరీఫ్, రెహమాన్ మదీనా తదితరులు, ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.