ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్
మంచిర్యాల (MNCL):
ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో బీసీలు 56 శాతానికి పైగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం కేవలం 9 శాతం మాత్రమే ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీలకు న్యాయం జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. కనీసం ఔట్ సోర్సింగ్ విభాగంలోనైనా 50 శాతం రిజర్వేషన్లను అమలు చేసి నిరుద్యోగ బీసీ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ప్రభుత్వానికి విన్నవించారు.