logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక: న్యాయవాది రామచంద్రా రావు.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల ప్రముఖ న్యాయవాది, బిసి కార్పొరేషన్ మాజి డైరెక్టర్ శ్రీ వి. రామచంద్రా రావు గత పండ్రెండేళ్ళుగా తన నివాసం దగ్గర ఉన్న మస్జిద్-ఎ-హుదా, పోలీస్ లైన్ మస్జిద్ లో ముస్లింలకు ఉపవాస విరమణ చేయించి, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి తానూ స్వయానా పాల్గొంటారు. ఈ నేపధ్యంలో ఈ సంవత్సరం కూడా పోలీస్ లైన్ మస్జిద్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్, ముస్లీం జేఎసి గౌ. అధ్యక్షులు అబులైస్, మస్జిద్ కమిటి ప్రెసిడెంట్ మాలి బాషా (ఫకృద్దీన్), ఖిద్మత్ సొసైటీ మేనేజర్ ముహమ్మద్ ఫయాజ్, జమాత్ నాయకులు షఫీ, అబ్బాస్ అలీ, న్యాయవాదులు బాలహాజి, సుహేల్ రాణా తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ తన తండ్రిగారు కీ. శే.సుబ్బరాయుడు కోరిక మేరకు ఓ సారి ఇఫ్తార్ విందు ఇచ్చానని, కల్మషం లేని ముస్లిం సోదరులు నిరాడంబరంగా చేసుకొనే ఆరాధనలు మరి ముఖ్యంగా తనకు ఆనందాన్ని, అనుభూతిని కలిగిస్తాయని అందుకే ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు ఇస్తుంటానన్నారు. అబ్దుల్ సమద్ మాట్లాడుతూ రామచంద్రారావు గొప్ప మనసుతో తమకు ఆహ్వానిస్తుంటారని, ఆయన ఉదార మనసుతో ఇచ్చే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా, లౌకికత్వానికి నిదర్శనంగా నిలబడుతుందని అభినందించారు. నేటి సమాజంలో ఇలాంటి కలయికలు, వేడుకలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు.

0
88 views

Comment