logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చప్పిడి శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని స్టవ్ బిడి కాలనీలోని నేతాజీ నగర్‌లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చప్పిడి శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.
నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీకి తమ మద్దతును తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాటక రాణి ప్రవీణ్ కుమార్, మన్నేపల్లి వినయ్ కుమార్, మన్నేపల్లి నాని, కుమారి నాగేంద్రతో పాటు జనసేన వీర మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

10
298 views

Comment