విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేసిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు
బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరు అయిన రూ. 2 కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ గారు మరియు గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు హాజరయి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరతరగతిన పూర్తి చేసి ప్రజలు తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు