రైతుల సౌకర్యార్థం... ఫౌజ్ పూర్ లో రేపటి నుండి ఎడ్ల అంగడి ప్రారంభం సద్వినియోగం చేసుకోవాలని నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం వినతి....
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో స్థానిక ప్రెస్ క్లబ్ లో పౌజ్ పూర్ గ్రామ పంచాయతీ కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించారు....ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ....ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తరోడ బి గ్రామ పంచాయతీ పరిధిలోని... పౌజ్ పూర్ గ్రామంలో...తేదీ 15, ఆదివారం రోజు నుండి రైతుల సౌకర్యార్థం... ఫౌజ్ పూర్ లో ఎడ్ల అంగడి ప్రారంభించబడుతుంది అని సంత లో రైతులకు కావాల్సిన పనిముట్లు కూడా అందుబాటులో ఉంచబోతున్నట్లు.... కావున తరోడ బి , పౌజ్ పూర్ గ్రామాల ప్రజలు ... ప్రతి ఆదివారం కొనసాగనున్న ఎడ్లంగడిని సద్వినియోగం చేసుకోవాలని... గ్రామ పంచాయతీ సర్పంచ్ బోయర్ అరవింద్, ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మలేరావ్ ప్రవీణ్, ఆకాష్,మధుకర్, భూమన్న రెడ్డి,స్వామి రెడ్డి,జైపాల్ రెడ్డి , లస్మా రెడ్డి తది తర పౌజ్ పూర్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ,గ్రామ యువజన నాయకులు పాల్గొన్నారు.