పదేళ్ల శ్రమ ఫలితం… పోలేరమ్మ ఆలయంతో కావలికి కొత్త కళ
హోదా లేదు… పదవి లేదు… ప్రచారం కోరిక అసలే లేదు. కానీ భక్తి, నిబద్ధత ఉంటే ఎంత పెద్ద పని అయినా సాధ్యమేనని నిరూపించారు ఎస్‌బీఐలో విశ్రాంతి అధికారి కంది శెట్టి రామమూర్తి.
వందల సంవత్సరాలుగా కావలిలో బావిలో ఉన్నట్లుగా ఉన్న పోలేరమ్మ అమ్మవారి విగ్రహం ఆయన మనసును కదిలించింది. పోలేరమ్మ కలలో కనిపించినప్పటి నుంచి కొత్త ఆలయం నిర్మించాలని సంకల్పించిన రామమూర్తి గారు, గత పదేళ్లుగా ఎన్నో అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఐదు దేవాలయాలు నిర్మించిన ఆయన, పోలేరమ్మ ఆలయం కోసం కూడా పట్టుదలతో ముందుకు సాగారు. చివరికి స్వయంగా సింగిల్ హ్యాండ్‌తో కోటిరూపాయల వ్యయం పెట్టి, కేవలం కొన్ని రోజుల్లోనే కొత్త ఆలయాన్ని నిర్మించి ప్రజలకు అందించారు.
ఎటువంటి ఆర్భాటం లేకుండా, నిరాడంబరంగా, ప్రచారాలకు దూరంగా ఆలయాన్ని సమర్పించి కావలి పట్టణానికి కొత్త కళను తీసుకొచ్చారు.
శ్రీ మాత్రే నమః.