logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రధాన ఎన్నికల కమిషనర్ Gyanesh Kumar తొలగింపుపై ప్రతిపక్ష ఎంపీల నోటీసు

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న Gyanesh Kumar ను తొలగించాలంటూ ప్రతిపక్ష ఎంపీలు సంచలన చర్యకు దిగారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలంటూ మొత్తం 193 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసుపై సంతకాలు చేసినట్లు సమాచారం. అందులో 130 మంది లోక్‌సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.
నిబంధనల ప్రకారం ఇటువంటి నోటీసును ఇవ్వడానికి కనీసం 100 మంది లోక్‌సభ సభ్యులు మరియు 50 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలు అవసరం. ఆ సంఖ్యను మించి ప్రతిపక్ష ఎంపీలు మద్దతు ఇవ్వడంతో ఈ నోటీసు ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించడానికి అవిశ్వాస తీర్మానం ప్రారంభించేందుకు ప్రయత్నం చేయడం భారత రాజకీయాల్లో ఇదే మొదటిసారిగా చెప్పబడుతోంది.
ఈ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది.

5
78 views

Comment