logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నెల్లూరు రూరల్‌లో రూ.1.85 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభానికి ఏర్పాట్లు పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు వేగం పెరుగుతోంది. 31వ డివిజన్ రామకోటయ్య నగర్ సెంటర్‌లో రేపు అనగా మార్చి 15వ తేదీ ఉదయం 10 గంటలకు జరగనున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు.
28, 29, 30 మరియు 31వ డివిజన్లలో సుమారు రూ.1.85 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఈ కార్యక్రమంలో శ్రీకారం చుట్టనున్నారు.
ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా టిడిపి నాయకులు, క్లస్టర్ ఇంచార్జులు, డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొననున్నారు.

0
0 views

Comment