logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో ఇండస్ట్రియల్ సందర్శించిన శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు.

నంద్యాల (AIMA MEDIA ): నంద్యాలలోని శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ నిర్వహణలో ఒక రోజు ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా లోని ఎం.వి.ఆర్. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ను సందర్శించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ, బాయిలర్ వ్యవస్థలు, టర్బైన్‌లు, కూలింగ్ వ్యవస్థలు వంటి విభాగాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పరిశ్రమలో అమలులో ఉన్న ఆధునిక సాంకేతికతలను తెలుసుకునే అవకాశం విద్యార్థులకు లభించింది అని ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఇలాంటి ఇండస్ట్రియల్ విజిట్లు విద్యార్థులకు పరిశ్రమల పని విధానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రత్యక్ష అవగాహన కలిగిస్తాయని తెలిపారు. తరగతి గదిలో నేర్చుకున్న సిద్ధాంతాన్ని పరిశ్రమలో జరిగే ప్రక్రియలతో అనుసంధానం చేసుకోవడం ద్వారా విద్యార్థులు మరింత ప్రాక్టికల్ జ్ఞానాన్ని సంపాదించగలరని చెప్పారు. భవిష్యత్తులో విద్యార్థులు తమ కెరీర్‌కు ఉపయోగపడే అనుభవాన్ని పొందడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.డిపార్ట్‌మెంట్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ హెచ్‌ఓడీ డా. బి. శేషయ్య మాట్లాడుతూ, పరిశ్రమలను సందర్శించడం ద్వారా విద్యార్థులు విద్యుత్ ఉత్పత్తి విధానాలు మరియు పరిశ్రమల పనితీరును దగ్గరగా అర్థం చేసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రాక్టికల్ జ్ఞానాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ పి. నాగరాజు, డా. ఎస్. జీలాన్ బాషా, అధ్యాపకులు ఎం. మల్లికార్జున రావు, కె. ఉమాదేవి, సి. లిఖిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

13
793 views

Comment