logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కమీషన్ల కోసం బూడిద బల్కర్ల పరుగులు… ప్రజల ప్రాణాలకు ముప్పు

SPSR నెల్లూరు జిల్లా – మార్చి 14
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల పరిధిలో ఉన్న ఏపీ జెన్కో యాష్ పాండ్ సమీపంలో శనివారం వేకువజామున భారీ బల్కర్ లారీల ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

గ్రామస్తుల ఆరోపణల ప్రకారం, బూడిద బల్కర్ లారీలు అధిక వేగంతో భద్రతా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా సంచరిస్తున్నాయి. దీంతో రహదారులపై ప్రయాణించే ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కమీషన్ల కోసం బూడిద అక్రమ రవాణాకు ప్రోత్సాహం లభిస్తోందని, అందుకే బల్కర్ లారీలు నియంత్రణ లేకుండా తిరుగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు.

ఈ ప్రమాదంలో పెద్ద నష్టం తప్పినప్పటికీ, ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బూడిద రవాణాపై కట్టుదిట్టమైన నియంత్రణలు విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

0
35 views

Comment