logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మహిమగల శనీశ్వర స్వామి ఆలయం… ప్రతి శనివారం భక్తుల సందడి

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న శనీశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే భారీగా వచ్చిన భక్తులు శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ… ఆలయానికి ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని తెలిపారు. అయితే గుడి ప్రాంగణంలో అన్నప్రసాదం స్వీకరించే సమయంలో భక్తులు ఎండలోనే కూర్చొని తినాల్సి వస్తోందని చెప్పారు. అందుకే ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ఒక షెడ్డు నిర్మించి ఇవ్వాలని కోరారు.
ఎంతో మహిమ గల ఈ శనీశ్వర స్వామి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని వినోద్ స్వామి తెలిపారు.

14
1929 views

Comment