ఆళ్లగడ్డలో మిన్నంటిన జనసేన ఆవిర్భావ వేడుకలు. జెండా ఆవిష్కరించిన ఇరిగెల సోదరులు
AIMA న్యూస్. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారంనాడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలు మిన్నంటాయి. నియోజకవర్గ తాలూకా జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి, యువనేత ఇరిగెల భరత్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయం వద్ద జనసేన పతాకాన్ని ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. జై జనసేన.జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశించిన మార్పు కోసం, సిద్ధాంతాల కోసం ప్రతి జనసైనికుడు సైనికుడిలా పనిచేయాలి. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పుట్టిన జనసేన పార్టీ, నేడు ప్రజల గుండెల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. రాబోయే రోజుల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు మాబు హుస్సేన్, డాలు.రత్నమయ్య, సజ్జల నాగేంద్ర, మిద్దె రాంపుల్లయ్య, దూదేకుల బాబు, మా భాష , బండి హరి మరియు జనసైనికులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.