logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ఆశిష్ సాంగ్వాన్ ఎల్పిజి లభ్యత, ఆయిల్ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లతో, జిల్లా అధికారులతో సమీక్ష

కామారెడ్డి ప్రతినిధి
( పాముల సంతోష్ కుమార్)
తేది:13.03.2026
కామారెడ్డి జిల్లా శుక్రవారం శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి LPG లభ్యతను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు , డిస్ట్రిబ్యూటర్లతో సమన్వయం చేసుకొని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిల్వ కేంద్రాలు , డిస్ట్రిబ్యూటర్ల గోదాముల్లో LPG స్టాక్ పరిస్థితిని ప్రతిరోజూ సమీక్షించడం తో పాటు నిల్వ ఉంచడం, మళ్లింపు, బ్లాక్ మార్కెటింగ్ , అనధికార వినియోగాన్ని కట్టడి చేయాలని సూచించారు. అవసరమైతే Essential Commodities Act కింద కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లా స్థాయిలో District Energy Supply Monitoring Committee ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ చైర్మన్‌గా, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి కన్వీనర్‌గా ఉండగా, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, రవాణా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, విద్యా శాఖ, సంక్షేమ శాఖలు, LPG డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారన్నారు.

ఈ సంగర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ LPG డిస్ట్రిబ్యూటర్లు వారి డెలివరీ సిబ్బంది వినియోగదారుల నుండి అదనపు ధరలు వసూలు చేయకూడదని, వినియోగదారులకు సరిపడా LPG సిలిండర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సంక్షేమ సంస్థలు తమ వద్ద ఉన్న LPG స్టాక్ లభ్యతను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు.
గృహ వినియోగ LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగించడం , నిల్వ ఉంచడం (hoarding) వంటి చర్యలను కట్టడి చేయాలని, అలాంటి వారిపై Essential Commodities Act, 1955 లోని సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. **అంతకుముందు*
రాష్ట్రంలో ఎల్.పి.జి గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న దృష్ట్య మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు,పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర లతో కలిసి జిల్లాల కలెక్టర్లు,ఎస్.పి లు,పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
అమెరికా-ఇరాన్ కు జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రజల్లో లేని పోనీ అపోహలు సృష్టించి వారిని గందరగోళంలో పడేసేలా జరుగుతున్న ప్రచారంపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఎల్.పి.జి గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి గందరగోళానికి గురి కావొద్దని,గృహ వినియోగదారులకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు.

సోషల్ మీడియా వేదిక ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంతోటే కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించేందుకు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రస్థాయిలో తిప్పి కొట్టారు.

ఇటువంటి గందరగోళం ఏర్పడినందునే రోజు వారిగా 72% బుకింగ్స్ జరుగుతున్నాయని అయితే గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు , విద్యాసంస్థలకు, వృద్దాశ్రమలకు,ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో 810 ఎల్.పి.జి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్.పి.జి కనెక్షన్లు ఉండగా రోజు వారిగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందని ఆయన వివరించారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని ఆయన తెలిపారు.

అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన హెచ్చరించారు.

తాజగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం,అక్రమంగా మళ్లించడం ,బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడిన వారిని ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేశామన్నారు.ఎల్.పి.జి డిస్ట్రిబ్యూటర్లు ఇదే విదంగా ప్రవర్తిస్తే మరిన్నీ కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు,ఎస్.పి లు,పోలీస్ కమీషనర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

ఆయా జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు,సరఫరా పరిస్థితిని సమీక్షించాలని ఆయన సూచించారు.

పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి ,గ్రామీణ 45 రోజులకు ఒకమారు ఎల్.పి.జి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు.

అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని,గృహా వినియోగ దారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని, ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

18
1379 views

Comment