కమిషనర్ రామచంద్రరావు ను సన్మానించిన కొండoపేట గ్రామస్తులు
విజయనగరం జిల్లా.రాజాం:
రాష్ట్ర పండుగగా నిర్వహించిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ వార్షికోత్సవ జాతర విజయవంతంగా నిర్వహించడంలో విశేషంగా సేవలు అందించిన రాజాం మున్సిపల్ కమిషనర్ ఏ.రామచంద్రరావు ను కూటమి నాయకులు అభినందించారు.
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరలో విశిష్ట సేవలు అందించిన రాజాం మున్సిపల్ కమిషనర్ ఏ.రామచంద్రరావు కు రాజాం కొండంపేట కూటమి నాయకులు ఆయనను దుస్సలువాతో ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బలిమి ఉమా, క్లస్టర్,వార్డ్ ఇంచార్జ్ నాగిరెడ్డి సూరిబాబు, సలాది బుల్లి, బాదిరెడ్డి చిన్న, త్రిపురాన మణి, ఉప్పల సంతోష్, సుంకర శ్రీను గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.