logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నెల్లూరు నగర అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు Ponguru Narayana ఆదేశాల మేరకు

నెల్లూరు నగర అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు Ponguru Narayana ఆదేశాల మేరకు, Nellore Municipal Corporation కో ఆప్షన్ మెంబర్ షేక్ జమీర్ గారు ఈరోజు 54వ డివిజన్‌లోని వెంకటేశ్వరం అంబేద్కర్ కాలనీ ప్రాంతంలో పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీధి లైట్లు వెలగడం లేదని, అలాగే సైడ్ కాలువల్లో చెత్త ఎక్కువగా ఉండటంతో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా మున్సిపల్ కులాయి నీళ్లు సరిగా రావడం లేదని కూడా ప్రజలు తెలియజేశారు.
ఈ సమస్యలను మంత్రి నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని షేక్ జమీర్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కో యూనిట్ ఇన్‌చార్జ్ రమేష్, బూత్ కన్వీనర్ వాసు, కో-కన్వీనర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

5
142 views

Comment