logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్

🔶 నేడు నెల్లూరు రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ మండలానికి 27 చెత్త సేకరించే రిక్షాలను మరియు డస్ట్ బిన్స్ పంపిణీ చేసిన మండల పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవతో గ్రామాలను స్వచ్ఛంగా ఉంచాలని, పరిశుభ్రతను పెంచి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరిచేవిధంగా స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని గ్రామంలో విస్తృతంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 ప్రతి దినం గ్రామాలలో ఈ చెత్త సేకరించే రిక్షాల ద్వారా ఉదయాన్నే ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేపట్టి ఆ గ్రామాన్ని స్వచ్చ గ్రామంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అదే విధంగా పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 ప్రతి మండలనికి ఒక స్వచ్చ రథం ఏర్పాటు చేసి ప్రతి ఇంటి నుంచి ప్లాస్టిక్, ఇనుము, బాటిల్స్ లాంటి పొడి చెత్తని సేకరించి వాటికీ బదులుగా ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది.టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 నెల్లూరు రూరల్ మండలంలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో ఎంపీటీసీ లు, సర్పంచులు, ఉపసర్పంచులు, క్లస్టర్ ఇంచార్జులు, కో క్లస్టర్ ఇంచార్జులు, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

1
2 views

Comment