దేశాన్ని కులం, మతం ఏలుతుంది. కాబట్టే వాజ్ పేయి, అధ్వానికీ భారతరత్న అవార్డ్ ఇచ్చారు
బహుజనులరా....
దేశాన్ని కులం, మతం ఏలుతుంది. కాబట్టే వాజ్ పేయి, అధ్వానికీ భారతరత్న అవార్డ్ ఇచ్చారు.
అంతకు ముందు సినిమా గాయకులకు, తబలా, షేహనాయి వాయించే వాయిధ్య గాళ్ళకు,ఆటగాళ్ళకు ఇచ్చారు.
అయితే రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజాస్వామ్య బద్దంగా..కుల మత ఘర్షలకు తావులేకుండా రాజకీయాలలో మార్పు తేవడం కోసం రాజకీయాలను నడిపిన కాన్షిరాం కు భారతరత్న అవార్డ్ ఇవ్వక పోవడం కుల, పక్ష పాత రాజకీయాలకు నిదర్శనం.
దేశ రాజకీయాలలో ఒక మార్పును తీసుకోరాదలచి
వేల సంవత్సరాలుగా అధికారానికి దూరం చేయబడిన బహుజనులు ఈ దేశాన్ని పాలించాలనే ఒక కాన్సెప్ట్ తో..
ముందుగా ఒక అంటరాని వర్గానికి చెందిన వాళ్ళను అందులోనూ ఒక స్త్రీని ఒక రాష్ట్రానికి CM చేయడం విప్లవం కాదా.? రాజకీయ సంస్కరణ కాదా.?నూతన రాజకీయాలను నెలకొల్పడం కాదా?
కోట్ల రూపాయలు తన చుట్టూ ఉన్న... జాతీయస్థాయిలో పార్టీని నడుపుతున్నా... ఒక్క రూపాయి కూడా బ్యాంకు బ్యాలెన్స్ లేకుండా... నిజాయితీతో... నిబద్ధతో రాజకీయాలను నడిపిన కాన్షిరాం కంటే అర్హుడు భారతరత్న అవార్డ్ కు ఈ దేశంలో ఎవరైనా వున్నారా?
కాబట్టి కాన్షిరాం కు 93 వ జయంతి సందర్భంగా భారతరత్న అవార్డ్ ఇచ్చి తీరాలని డిమాండ్ చేద్ధాం.రండి
మార్చి 15 సాయంత్రం 5 గంటలకు లో కావలి బుద్ధా విహార్ లో జరిగే కాన్షిరాం జయంతి సభ ద్వారా ఇంటల్ జెన్సీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేరేలా...నినదిద్దాం రండి
జై భీమ్ జై కాన్షిరాం