logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

371 మంది రైతులకు 22 లక్షల26 వేల మెగా చెక్కును అందజేసినది... అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి*

*రైతు బిడ్డ పాలిస్తున్న రాష్ట్రం ఇది... అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి*

అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి.తపోవనంలోని రైతు భరోసా కేంద్రం వద్ద అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల కార్యక్రమం.371 మంది రైతులకు 22 లక్షల26 వేల మెగా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే*మాది రైతు పక్షపాత ప్రభుత్వం.. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ అందించాం.ఆరోజు ఎన్టీఆర్ . ఈరోజు చంద్రబాబు ఇద్దరు ముఖ్యమంత్రులు రైతుబిడ్డలే.రైతు సంక్షేమం కోసం చంద్రబాబు చేసినంతగా మరే ముఖ్యమంత్రి చేయలేదు*30 వేల కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నారు.హంద్రీనీవా ప్రాజెక్టును 1800 నుంచి 3800 క్యూసెక్కులకు వెడల్పు చేశారు.3500 కోట్లు ఖర్చుపెట్టి రికార్డు టైంలో కాలువ వెడల్పు చేశారు.450 చెరువులను నింపుతూ కుప్పం వరకు నీరు తీసుకెళ్లారు.ఆరోజు పట్టిసీమ ను పూర్తి చేసి కోస్తా ప్రాంతానికి 350 టీఎంసీల గోదావరి జలాలు అందించారు*కృష్ణా నీటిని మనం పూర్తిస్థాయిలో వాడుకునే విధంగా చేశారు*

గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి రైతు కోసం ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు.ఒక్క ఎకరాకు కూడా డ్రిప్పు, స్ప్రింక్లర్లు ఇవ్వలేదు.ముఖ్యమంత్రి చంద్రబాబు 1,50,000 హెక్టార్లకు డ్రిప్పు స్ప్రింక్లర్లు అందజేశారు.మరో మూడేళ్లలో రాయలసీమను పూర్తిస్థాయిలో వ్యవసాయపరంగా అభివృద్ధి చేయబోతున్నారు.నియోజకవర్గ రైతులకు ఎప్పటికీ అండగా ఉంటాను.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

2
5 views

Comment