✳️ *శ్రీరామ తారక పంచాయతన దేవతాయజ్ఞ అష్టోత్తర మహా కలశ కుంబాభిషేకం* ✳️
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోగల హుడా ట్రేడ్ సెంటర్ శ్రీ సీతారామాంజనేయస్వామి రాజగోపుర శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా,నాల్గవ రోజు ది 13-03 -2026 శుక్రవారం ఉదయం గం7- 30 నిమిషములకు,ప్రధాన కలిశ సహిత చతుస్థాన అర్చన, గణపతి చండీ మహా లింగార్చన, సుందరాకాండ, సూర్య నమస్కార పారాయణ సహిత, విశేష రామ తారక మూలమంత్ర హవనములు నిర్వహించారు. సాయంత్రం ప్రధాన దేవత హోమములు, మహా సుదర్శన సహిత, మహా నారాయణ హవనములు, నీరాజన మంత్రపుష్పములు , చతుర్వేద స్వస్తి బలి ప్రధానం, తదనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ కన్నేపల్లి శివరామచంద్రమూర్తి గురువుగారు మరియు పాలక కమిటీ సభ్యులు, ఆలయ అర్చక స్వాములు, భక్తులు,విరివిగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.