logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చిత్రదుర్గ, కర్నాటక నివాసి ఆత్మయత్నం......

చిత్రదుర్గ, కర్నాటక నివాసి అయిన 35 ఏళ్ల పురుషుడు మద్యం సేవించిన తర్వాత 50ml లేతల్ 20 EC (క్లోరఫీరిఫోస్ 20%EC) తాగడం జరిగింది. కుటుంబ సభ్యులు అక్కడే ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్ళడం జరిగింది. ప్రాణానికి ప్రమాదం ఉందని, బ్రతకడo కష్టం అని చెప్పడంతో హుటాహుటిన వంశీ హాస్పిటల్, అరవింద్ నగర్ 1st క్రాస్, అనంతపురంకి తీసుకొని రావడం జరిగింది

బీపీ పడిపోవడం, గుండె కొట్టుకోవడంలో కొద్దిగా వేగం తగ్గడం, వాంతులు, మూత్రం మరియు ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, స్పృహలో లేకపోవడంతో హాస్పిటల్‌లో పురుగుల మందు విష ప్రమాదాల చికిత్సలో ప్రావీణ్యం కలిగిన "డాక్టర్ యం. విజయ్ పాల్ రెడ్డి" అప్పటికప్పుడు పేషంట్ ని MICU(ఐసీయూ) లో చేర్చారు. RT (Ryles Tube) ద్వారా కడుపు శుభ్రపరిచడం, ఔషధాలు, ఇనోట్రోప్స్, ఇతర చికిత్సలతో పరిస్థితిని నియంత్రించారు.

క్రిటికల్ కేర్‌లో చికిత్స అందించారు. ఈ ప్రక్రియలో హాస్పిటల్ నర్సింగ్ సిబ్బంది అనువైన సేవలందించారు, నిరంతర చికిత్స అందించడంతో లక్షణాలపరంగా మెరుగుపడ్డారు & స్థిరంగా ఉన్నారు. పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతుడిగా, బీపీ స్థిరంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు.

ఈ సందర్భంగా సమర్థవంతమైన కార్పొరేట్ వైద్యసేవలు అనంతపురంలోనే అందించినందుకు కుటుంబ సభ్యులు "డాక్టర్ విజయ్ పాల్ రెడ్డి" మరియు వంశీ హాస్పిటల్ యాజమాన్యం, నర్సింగ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబ సభ్యుడిని కాపాడినందుకు "డాక్టర్ విజయ్ పాల్ రెడ్డి"ని ప్రశంసించారు. “మా కుటుంబానికి కొత్త ఆశ నిచ్చిన వైద్యుల సేవలను ఎప్పటికీ మర్చిపోలేం” అని వారు తెలిపారు.

0
13 views

Comment