logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జిల్లా ప్రజా పరిషత్ లో కవయిత్రి మొల్లమాంబ జయంతి....

అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్. స్థానిక అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములోని ప్రధాన సమావేశ మందిరం నందు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన మొదటి (ప్రణాళిక మరియు ఆర్ధిక) స్థాయి సంఘ, రెండవ (గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘం) స్థాయి సంఘ, నాలగవ (విద్యా, వైద్యం) స్థాయి మరియు ఏడవ (పనులు) స్థాయి సంఘముల, సంభందిత అధ్యక్షుల అధ్యక్షతన 6వ (సాంఘిక సంక్షేమం) స్థాయి సంఘ, మూడవ (వ్యవసాయ స్థాయి సంఘం) స్థాయి సంఘ, మరియు 5వ స్థాయి సంఘం (స్త్రీ సంక్షేమం) సమావేశములు నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు ప్రగతి నివేదికలు మరియు వారి శాఖ ద్వారా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను స్థాయీ సంఘ సభ్యులకు వివరించారు, అనంతరం స్థాయీ సంఘ సభ్యులు వారి సంబంధిత ప్రాదేశిక నియోజక వర్గం నందు గల సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా వెంటనే వాటిని పరిష్కరించవలసినదిగా గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ సంబంధిత అధికారులను అదేశించడం జరిగినది. అనంతరం కవయిత్రి మొల్లమాంబ గారి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పుష్ఫ నివాళులు అర్పించారు. ఈ సమావేశాలలో జడ్పీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి .శివ శంకర్ , ఉప ముఖ్య కార్య నిర్వహణ అధికారి శ్రీ వెంకటసుబ్బయ్య , సంబంధిత స్థాయీ సంఘాలలోని జెడ్.పి.టి.సి.సభ్యులు మరియు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

0
0 views

Comment