logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కావలి నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన ఆధ్వర్యంలో కుమ్మర ఆడపడుచు, తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ గారి జయంతి కార్యక్రమం

ఈ రోజు పెద్దపవని రోడ్ వైకుంఠపురం సెంటర్ లో కావలి నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన ఆధ్వర్యంలో కుమ్మర ఆడపడుచు, తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ గారి జయంతి కార్యక్రమం అట్టహాసం జరిగింది.ఈ సందర్భంగా కుమ్మర యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు బెజవాడ అభిసాగర్ ప్రజాపతి మాట్లాడుతూ ఆతుకూరి మొల్లమాంబ గారు రామాయణాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన గొప్ప రచయిత్రి అని కొనియాడారు, అలాగే రాబోయే రోజులలో కావలి పట్టణంలో కవయిత్రి మొల్లమాంబ గారి విగ్రహం అందరి సహకారంతో ఏర్పాటు చేస్తాము అని తెలియజేశారు. కుమ్మర యువసేన నాయకుడు మన్నేపల్లి రుషికేశ్ ప్రజాపతి మాట్లాడుతూ కవయిత్రి మొల్లమాంబ గారి జయంతి వేడుకలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ల గుడ్లూరి మాల్యాద్రి ప్రజాపతి, యేగూరి చిన్నపుల్లయ్య ప్రజాపతి, కుమ్మర సంఘం నాయకులు బెజవాడ రవీంద్ర ప్రజాపతి,పొన్నగంటి మురళి ప్రజాపతి, బెజవాడ ప్రసన్న కుమార్ ప్రజాపతి, వేణు ప్రజాపతి,పత్తిపాటి వేదనాథ్ ప్రజాపతి,దిలీప్ కుమార్ ప్రజాపతి,బీసీ నాయకులు ద్రోణాదుల వెంకట్రావు, అద్దంకి ప్రభాకర్,న్యాయవాదులు ఎన్. భారత్ రాయల్, గుంజి నరేష్ మరియు బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు గుండ్లపల్లి భరత్ కుమార్,బ్రహ్మానందం, కుమార్ గౌడ్, మంద కిరణ్ తదితరులు పాల్గొన్నారు.*

4
90 views

Comment