logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లేకుండా రైతు సాగు చేసే రోజులు రావాలి*...

ప్రభుత్వ అవకాశాలను రైతులు సద్వినియోగం.చేసుకోవాలి.జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ రైతుల సంక్షేమమే ప్రభుత్వ చేయమని ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్
ఓ ఆనంద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలంలోని ఆలమూరు గ్రామం సూర్యనారాయణ రైతు పొలంలో జరిగిన అన్నదాత సుఖీభవ పథకం మరియు పీఎం కిసాన్ పథకంలో భాగంగా మూడో విడత నగదు విడుదల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్
ఓ. ఆనంద్, రాప్తాడు శాసనసభ్యురాలు శ్రీమతి పరిటాల సునీత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు చేయూత ను అందించాలనే దృడ సంకల్పంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సాయంకి ఇబ్బంది లేకుండా ఉండాలని సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ. 14000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా 6000 రూపాయలు మొత్తంగా ప్రతి రైతుకు ఒక సంవత్సరానికి 20 వేల రూపాయలను మూడు దఫాలుగా అందించడం జరుగుతున్నదన్నారు. జిల్లాలో వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో ఉద్యాన పంటలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు వ్యవసాయ ఉద్యాన శాఖ ద్వారా చేపడుతున్న పంటల అవగాహన శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని, సూక్ష్మ బిందు సేద్యం, అరటి సాగుపట్ల ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. జిల్లాలో ఆయా ప్రాంతాలలో నీటిని సద్వినియం చేసుకుంటూ ఎక్కువగా మిశ్రమ పంటలో అంతర పంటల మీద మరియు పంటల మార్పిడి విధానాలను పాటించడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయం పట్ల కూడా రైతులు అవగాహనకలిగిఉండాలన్నారు. రైతులందరూ తగిన సహకారాలు అందిస్తే ఉద్యానపంటలకు పూర్తిస్థాయిలోప్రోత్సహిస్తామన్నారు. రైతులు సాంకేతికతను పెంపొందించు కావాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక చేయూతను సద్వినియం చేసుకోవాలన్నారు. అంతకుముందు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమాన్ని రైతులతో కలిసి ఎమ్మెల్యే కలెక్టర్ వీక్షించారు. అలాగే రైతులతో వ్యవసాయ పంటలపై కాసేపు ముచ్చటించారు.
*చంద్రన్న వచ్చాకే కరవు నేలపై నీరు పారింది.

*సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లేకుండా రైతు సాగు చేసే రోజులు రావాలి*

*అన్నదాత సుఖీభవ 3వ విడత కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత*

*అన్నదాత సుఖీభవ 3వ విడుత కింత రైతుల ఖాతాల్లో రూ.6వేల జమ*

*రాప్తాడు నియోజకవర్గంలో 51,500మంది రైతులకు రూ.30.90కోట్ల చెక్కు అందజేత*

*పీఏబీఆర్ కుడి కాలువకు అదనంగా ఒక టీఎంసీ నీరు కేటాయించాలని ఎమ్మెల్యే సునీత విజ్ఞప్తి*

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయ్యాకనే.. కరవు నేలపై నీరు పారిందని ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఆలమూరు గ్రామంలో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆమె జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆలమూరు చెరువులో పీ.ఎం.ఎం.ఎస్.వై పథకం ద్వారా 40శాతం సబ్సిడీతో చేపపిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు, మత్స్యకారులు, పలువురునాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 32వేలచేప పిల్లలను వదిలారు. అలాగే రాప్తాడు చెరువులోకి 9వేల 200లు, మదిగుబ్బ చెరువులోకి 7వేల 900, తోపుదుర్తి చిన్న చెరువులోకి 4వేల 600, తోపుదుర్తి పెద్ద చెరువులోకి 11వేల 800 మొత్తం 65వేల 500 చేపపిల్లలను ఆయా గ్రామాల సాగునీటి చెరువులలోకి వదిలారు. అనంతరం అరటి, మొక్కజొన్న, చీని పంటలను పరిశీలించి రైతులతో పంటల స్థితిగతులను తెలుసుకున్నారు. వివిధ పంటలో సాగు, ఉత్పత్తి, దిగుబడి, మార్కెటింగ్ లో ఉన్న సమస్యల్ని చర్చించారు. రైతులు ఒక యూనిటీగా ఏర్పడి పంటల ఉత్పత్తి పంటల మార్కెటింగ్ పై దృష్టి సారించాలని కలెక్టర్ గారు రైతులకు సూచించారు. అనంతరం అన్నదాత సుఖీభవకి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. రాప్తాడు నియోజకవర్గంలో సుమారు 51వేల 500మంది రైతులకు 3వ విడతలో రాష్ట్రం ప్రభుత్వం ద్వారా రూ.20.60 కోట్లు, కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.10.30 కోట్లు మొత్తం రూ.30.90 కోట్లు జమ చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు 20వేల రూపాయలు అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 3వ విడుత 6వేలతో కలిపి మొత్తం 20వేల రూపాయలు నేడు అందించడం జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి మేలు జరగలేదన్నారు.
రైతులందరికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అకౌంట్లో డబ్బు జమ చేశారని.. ఈరోజు ప్రతి రైతు కళ్లలో ఆనందం కనిపిస్తోందన్నారు. ఒకప్పుడు నీరు లేక అల్లాడిన ఈ ప్రాంతంలో చెరువులను నింపుకొని చేప పిల్లలు వదిలేవరకు వచ్చామన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హంద్రీ- నీవా నీరు తీసుకురావడం వలన సాధ్యమైందన్నారు. ప్రస్తుతం పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా చెరువులకు నీరు అందిస్తున్నారని అయితే నిర్దేశిత చెరువులకు నీరు అందాలంటే మరొక టీఎంసీ అదనంగా నీరు విడుదల చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. పీఏబీఆర్ కుడికాలువ ద్వారా నీరు అందక చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగాయన్నారు. కాలువ గట్ల మీద రాత్రి వేళల్లో పహారా కాయాల్సిన పరిస్థితి కూడా ఉండేదన్నారు. ఇలాంటి పరిస్థితిని మార్చేందుకు హంద్రీనీవా కాలువను పీఏబీఆర్ కుడికాలువను అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒప్పుకున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు ఎమ్మెల్యే సునీత గుర్తు చేశారు. కేవలం నాలుగున్నర కోట్ల రూపాయలు విడుదల చేస్తేఅదిసాధ్యమవుతుందని.. జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయంలో చొరవ చూపుతున్నారన్నారు. త్వరలోనే ఆ కల సాకారం కాను న్నదన్నారు. రైతులంతా ఒకే రకం పంటలు వేసి ఎక్కడ నష్టపోవద్దని మరోసారి పరిటాల సునీత సూచించారు. తాను కూడా తన వ్యవసాయ క్షేత్రంలో పంటలు సాగు చేయాలనుకున్నప్పుడు చాలామంది రైతులను, నిపుణులను సంప్రదించి పంటలను మారుస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ రైతుల విషయంలో చేసిన సలహాలు చాలా విలువైనవని త్వరలోనే ఆయనతో ఒక సమావేశం నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. రాప్తాడు నియోజకవర్గం ప్రాంతానికి నీరు ఇస్తే రైతులు బంగారు పంటలు పండిస్తారని అన్నారు. నీరు మార్కెటింగ్ సౌకర్యం ఉంటే రైతులకు ఎలాంటి సబ్సిడీలు అవసరం ఉండదని... అలాంటి రోజులు మనం చూడాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపైతమ మనోభావాలను అందించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు చేకూరిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం .రవి, తాసిల్దార్ మోహన్ కుమార్ వ్యవసాయ ఉద్యానవన తదితర శాఖ అధికారులు పలువురు రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0
0 views

Comment