logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం

ఇచ్చిన హామీ మేరకు రైతులకు 20 వేల పెట్టుబడి భరోసా
- పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ మూడవ విడత నిధుల విడుదలతో రైతుల ముఖాల్లో సంతోషం
- ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ మూడవ విడత నిధుల విడుదల సందర్భంగా జిల్లా రైతుల తరఫున ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రైతులకు లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 20 వేలు ఆర్థిక సహాయం చేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యం అన్నారు. రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2675 కోట్లు జమ చేసి రైతు పక్షపాత ప్రభుత్వమని తెలియజేశారున్నారు. నెల్లూరు జిల్లా పరిధిలో 1 లక్ష 95 వేల మందికి 111 కోట్లు వారు బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ కావడం వల్ల వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకునే అవకాశం కలిగిందని ఎంపీ పేర్కొన్నారు. రైతుల జీవితాల్లో సంతోషం, స్థిరత్వం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మూడవ విడత నిధుల విడుదలతో రైతులకు మరింత ఆర్థిక భరోసా లభిస్తుందని, రైతాంగం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

1
80 views

Comment