logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గుత్తి కోట ఉత్సవాలకు సర్వం సిద్ధం* జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్*....


*గుత్తి కోట ఉత్సవాలకు సర్వం సిద్ధం*
- *: జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్
- *ఈనెల 14, 15వ తేదీలలో నిర్వహించే గుత్తి కోట ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం గుత్తి పట్టణంలోని ఫుట్ బాల్ గ్రౌండ్ లో గుత్తి కోట ఉత్సవాలు - 2026 కోసం చేపడుతున్న ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.*

- *ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ శనివారం, ఆదివారాలలో నిర్వహించే గుత్తి కోట ఉత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈరోజు రాత్రిలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గ్రౌండ్ లో స్టేజ్, స్టాల్స్, ఫుడ్ కోర్టుల ఏర్పాటు వెంటనే సిద్ధం కావాలని, ప్రోటోకాల్ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వీక్షకులను ఆకట్టుకునేలా ఏర్పాటు ఉండాలని సూచించారు. శానిటేషన్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలన్నారు. విఐపిల ఎంట్రీ, ఎగ్జిట్ జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలన్నారు. అన్ని రకాల ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు వారికి కేటాయించిన పనులను బాధ్యతగా నిర్వహించాలని, అందరూ సమన్వయంతో ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆదేశించారు. ఆదివారం నిర్వహిస్తున్న హెరిటేజ్ వాక్ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. గుత్తి కోట వారసత్వం గురించి అందరికీ తెలిసేలా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు.*

- *ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల, జిల్లా టూరిజం అధికారి జయకుమార్ బాబు, గుంతకల్లు ఆర్డీవో ఆర్బిఎస్కే.శ్రీనివాస్, గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, డిఎల్డిఓ విజయలక్ష్మి, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ బాలకొండయ్యా, జిల్లా హార్టికల్చర్ అధికారి ఉమాదేవి, ఎపిఎంఐపి పిడి రఘునాథరెడ్డి, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ చౌదరి, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, డిఎస్డిఓ మంజుల, ఆర్కియాలజీ ఎడి స్వామినాయక్, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, తహసీల్దార్లు హరికుమార్, పుణ్యవతి, ఉషారాణి, రమాదేవి, ఆయా శాఖల జిల్లా, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

0
124 views

Comment