జనసేన చొరవతో యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న భారతీయుల రక్షణ – నెల్లూరు జిల్లా కార్యాలయంలో
ఒక హిందువు ఒక క్రిస్టియన్ పాస్టర్ ప్రాణాలను కాపాడి మానవత్వమే ప్రధానమనినిరూపించాం...
జనసేన పార్టీ చొరవతో గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చిన ఘటనపై జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం, గోమతి నగర్‌లో ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకున్న దాదాపు 60 మంది భారతీయులను (తెలంగాణకు చెందిన 30 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 30 మంది) జనసేన పార్టీ చొరవతో సురక్షితంగా భారతదేశానికి రప్పించినట్లు తెలిపారు.
ఈ ప్రెస్ మీట్‌లో ప్రముఖ రిటైర్డ్ సర్వోదయ ప్రిన్సిపల్, “A Binding Hope Church” ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టైటిల్ నిర్మల్ కుమార్ గారు, అలాగే జనసేన పార్టీ తరఫున కీలక పాత్ర పోషించిన జాతీయ మీడియా ప్రతినిధి, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టైటిల్ నిర్మల్ కుమార్ గారు మాట్లాడుతూ,
“మానవత్వమే ప్రధానమని ఈ సంఘటన మాకు తెలియజేసింది. ఒక హిందువు ఒక క్రిస్టియన్ పాస్టర్ ప్రాణాలను కాపాడటానికి ముందుకు రావడం గొప్ప విషయం. మనుషుల మధ్య ప్రేమ ఉండాలి కానీ కులం, మతం అనే గోడలు ఉండకూడదు” అని తెలిపారు.
అలాగే యుద్ధ సమయంలో బాంబులు పేలుతున్న భయానక పరిస్థితుల్లో తమ ప్రాణాలు ఎలా నిలబెట్టుకున్నామో వివరించారు. “మాకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో బాంబు పేలింది. ఒక బాంబు మా మీద పడి ఉంటే మేమంతా ప్రాణాలు కోల్పోయేవాళ్ళం. అలాంటి పరిస్థితిలో జనసేన పార్టీని ఆశ్రయించడంతో మేము ఈరోజు సురక్షితంగా భారత్ చేరుకున్నాం.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వేములపాటి అజయ్ గారి సహకారం వల్లే మేము తిరిగి స్వదేశానికి వచ్చాము. లేకపోతే మేము ఇంకా అక్కడే ఉండిపోయేవాళ్ళం” అని భావోద్వేగంతో తెలిపారు.
ఈ కష్టకాలంలో తమకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటామని, ఆ క్షణాల్లో తమ బిడ్డలే గుర్తొచ్చాయని కన్నీటి పర్యంతం అయ్యారు.
వేములపాటి అజయ్ గారు మాట్లాడుతూ,
“జనసేన పార్టీ అధ్యక్షులు Pawan Kalyan గారు మాకు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ఆ కుటుంబం బలమే ఈరోజు 60 మంది భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి కారణమైంది” అని తెలిపారు.
సమాచారం అందిన వెంటనే పార్టీ నెట్వర్క్ ద్వారా అందరికీ తెలియజేసి, ఎంపీ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బీద మస్తాన్ రావు గారు, ముఖ్యమంత్రి కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చామని తెలిపారు.
అజయ్ గారి సమాచారం తో దుబాయ్ లో ఉన్న జనసేన కార్యకర్తల సహకారంతో అక్కడే ఉన్న జనసైనికులు దాసరి చంద్రశేఖర్, మంజుల, ఉదయలకు తెలియజేయగా బెహరైన్ జనసేన అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మరియూ apnrts టీం తదితరులు ప్రతి గంట పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులకు ధైర్యం చెప్పి, ప్రత్యక్షంగా వారిని కలుస్తూ అవసరమైన సహాయాన్ని అందించారని చెప్పారు.
ఈ ఘటన ద్వారా జనసేన పార్టీ బలం ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందో స్పష్టంగా కనిపించిందని తెలిపారు.
“జనసేన పార్టీ నాకు ఇచ్చిన ఈ అవకాశంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను మరింతగా కొనసాగిస్తాను. పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి నా సేవలు మరింతగా అందిస్తాను” అని అన్నారు.
ఈ కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం, గోమతి నగర్‌లో నిర్వహించబడింది.
ఈ ప్రెస్ మీట్‌లో టైటస్ నిర్మల్ కుమార్ తో జనసేన జాతీయ మీడియా ప్రతినిది వేములపాటి అజయ్,సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్,జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల,జనసేన నాయకులు చిట్టమూరు ప్రవీణ్ రెడ్డి,పప్పు నారాయణ,హరీష్ చదలవాడ,వారి స్నేహితులు డేవిడ్ పార్టీ నాయకులు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.