logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వృత్తి విద్యతో అనేక ఉపాధి అవకాశాలు..

సమగ్ర శిక్ష, అనంతపురము జిల్లా పరిధిలో వృత్తి విద్యపై వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వృత్తి విద్యశిక్షకు లకు రీజినల్ ట్రైనింగ్ సెంటర్ , కొర్రపాడు (V), బుక్కరాయసముద్రం (M), అనంతపురము డిస్ట్రిక్ట్ నందు తేదీ:13.03.2026 (శుక్రవారం) అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ సదస్సు నందు శ్రీమతి.టి.శైలజ, ఏపీసీ, సమగ్ర శిక్ష మాట్లాడుతూ వృత్తి విద్యతో అనేక ఉపాధి అవకాశాలు పొందవచ్చని, విద్యార్థి దశ నుంచే వివిధ అంశాల వారీగా నైపుణ్యం సాధించాలన్న లక్ష్యంతో పాఠశాల స్థాయిలో వృత్తివిద్య తరగతులు నిర్వ హించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని ఎక్కువ మంది విద్యార్థులు వినియోగిం చుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. తరగతి గదిలో బోధించడంతో పాటు వృత్తివిద్య పై నైపుణ్యం సాధించుటకు క్షేత్రస్థాయి పర్యటనలకు విద్యార్థులను తీసుకెళ్లాలన్నారు. జిల్లాలో కొత్త గా జాయిన్ అయిన ఒకేషనల్ ట్రైనర్స్ కు టాబ్స్ అందజేయడం జరిగింది అలాగే వివిధ అంశాలపై విషయ నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో శ్రీ.బి.శ్రీనివాస రావు, ఉపవిద్యాశాఖాధికారి , అనంతపురము, శ్రీమతి.కె.కవిత, జి.సి.డి.ఒ, శ్రీ.వేణుగోపాల్, ఎ.యం.ఒ మరియు తదితరులు పాల్గొన్నారు.

0
185 views

Comment