logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం 3వ విడత 2025-2026

తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు గ్రామం నారాయణస్వామి కళ్యాణమండపంలో నిర్వహించిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం” కార్యక్రమం విజయవంతం*

*ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సహాయాన్ని నేరుగా జమ చేయడం రైతులకు ఎంతో ఉపశమనం కలిగించే విషయం.*

*ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగువాసి ప్రసాద్ బాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొనారు అలాగే స్థానిక నాయకులు, రైతులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.*

*ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ఆధునిక వ్యవసాయ పద్ధతులు గురించి అవగాహన కల్పించాను. ముఖ్యంగా హార్టికల్చర్ పంటలు, డ్రిప్ ఇరిగేషన్ విధానం మరియు వ్యవసాయ డ్రోన్ల వినియోగం గురించి వివరంగా తెలియజేశాను.*

*హార్టికల్చర్ పంటల సాగులో డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించడం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. మొక్కలకు అవసరమైన నీరు మరియు ఎరువులు నేరుగా వేర్లకు చేరడం వల్ల పంటల వృద్ధి మెరుగుపడుతుంది మరియు నీటి వినియోగం కూడా తగ్గుతుంది.*

*అలాగే వ్యవసాయ డ్రోన్లు ఉపయోగించడం ద్వారా పంటలపై ఎరువులు మరియు పురుగుమందులను సమానంగా పిచికారీ చేయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పని చేయడం వల్ల రైతుల శ్రమ మరియు ఖర్చు తగ్గి, వ్యవసాయం మరింత సులభంగా మారుతుంది.*

*ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మరియు ఆధునిక సాంకేతికతలను రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.*
*పై కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గ నాయకులు రైతులు కూటమి నాయకులు పాల్గొన్నారు*

*– పోలంరెడ్డి దినేష్ రెడ్డి*
*చైర్మన్, APEMCL*

0
260 views

Comment