గుత్తి కోట ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి*
*గుత్తి కోట ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి*
- *: జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్*
- *ఈనెల 14, 15వ తేదీలలో నిర్వహించే గుత్తి కోట ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం గుత్తి కోట ఉత్సవాలు - 2026 నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.*
- *ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14, 15వ తేదీలైన శనివారం, ఆదివారంలలో గుత్తి కోట ఉత్సవాలను నిర్వహిస్తుండగా, ఏ ఒక్క చిన్న సమస్య రాకుండా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఉత్సవాల కోసం ఒక్కరోజు మాత్రమే సమయం ఉందని, అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలన్నారు. ఉత్సవాలు నిర్వహించే ఫుట్ బాల్ గ్రౌండ్ లో వెన్యూ, స్టాల్స్ రేపటిలోగా సిద్ధం కావాలన్నారు. ప్రోటోకాల్ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీకి సంబంధించి అప్రోచ్ రోడ్లలో బిటి ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలని, గ్రౌండ్ శుభ్రం చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, టాయ్ లెట్స్ ఏర్పాటు చేయాలని ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులకు సూచించారు. స్టాల్స్, పార్కింగ్ వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని, ఏ సమస్య రాకుండా చూసుకోవాలని సూచించారు. విఐపి, జనరల్ పార్కింగ్, శానిటేషన్, జంగిల్ క్లియరెన్స్ జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. స్టేజీ ఏర్పాటు పూర్తి చేయాలని, కల్చరల్ కార్యక్రమాలు సిద్ధం చేయాలన్నారు. ఎగ్జిబిషన్, స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేపట్టాలని, ఏర్పాట్లు అన్ని సరిగా ఉన్నాయా లేదా ముందుగానే చూసుకోవాలన్నారు. పబ్లిక్ మొబిలైజేషన్ చేపట్టాలని, ఉత్సవాలకు సంబంధించి గ్రామాల్లో టాంటాం వేయించాలని, అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హెరిటేజ్ వాక్ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. గుత్తి కోట వారసత్వం గురించి అందరికీ తెలిసేలా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. అయా శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో గుత్తి కోట ఉత్సవాలపై విద్యార్థులకు కాంపిటీషన్లను నిర్వహించాలన్నారు. వెన్యూ వద్ద, పార్కింగ్ వద్ద సెక్యూరిటీ, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఎక్కువమంది ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని, 108 వాహనాలను అందుబాటులో ఉంచాలని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. ఆయా శాఖల అధికారులు వారికి కేటాయించిన బాధ్యతలను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.*
- *ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల, జిల్లా టూరిజం అధికారి జయకుమార్ బాబు, గుంతకల్లు ఆర్డీవో ఆర్బిఎస్కే.శ్రీనివాస్, గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, ఆయా శాఖల జిల్లా, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.*