సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి*
*ప్రపంచం మొత్తం రాయలసీమ వైపు చూసేలా హార్టికల్చర్ హబ్ ఉంటుంది*
*ఇది రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రేమ*
*సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి*
*35 మందికి రూ.30లక్షల92వేల రూపాయల చెక్కులు పంపిణీ.
అనంతపురం, మార్చి 12;
ప్రపంచం మొత్తం రాయలసీమ వైపు చూసే విధంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చబోతున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 26వ విడుతలో భాగంగా మొత్తం 35 మందికి 30 లక్షల 92వేల రూపాయలు విలువచేసే చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ టీడీపీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎంతో పాటు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఇప్పటివరకు అర్బన్ నియోజకవర్గంలోనే ఐదున్నర కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించామన్నారు. ఇందులో సగానికి పైగా మైనార్టీలకు సాయం అందిందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా పేదల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి ఎంత ఖర్చైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా అనంతపురం జిల్లాకు అత్యంత కీలకమైన హంద్రీనీవా కాలువను రికార్డ్ సమయంలో వెడల్పు చేసి శ్రీశైలం నుంచి ఈసారి 50 టీఎంసీల నీటిని తీసుకున్నామన్నారు. ముఖ్యంగా రాయలసీమను ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా లక్ష కోట్లతో గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ గా మార్చబోతున్నారని.. ఇది రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటికే 130కోట్లతో అభివృద్ధి పనులు చేశామని.. ఇటీవల అసెంబ్లీలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి మరింత నిధులకు ఆమోదం లభించిందని.. త్వరలోనే ఈ పనులు కూడా చేపడుతామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్, కార్పొరేషన్ డైరెక్టర్లు పి ఎల్ ఎన్ మూర్తి, పోతుల లక్ష్మీనరసింహులు, క్లస్టర్ ఇంచార్జ్ లు కాయగూరల శ్రీధర్, గోపాల్ గౌడ్, టిడిపి జిల్లా కార్యదర్శి కంఠాదేవి టిడిపి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయం నుండి పంపబడినది.