logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అహుడ గ్రీవెన్స్ త్వరితగతిన పరిష్కరించాలి* ..



*అహుడ గ్రీవెన్స్ త్వరితగతిన పరిష్కరించాలి*
అహుడ సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డి*
అనంతపురము - హిందూపురము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) పరిధిలో వస్తున్న గ్రీవెన్స్ త్వరితగతిన పరిష్కరించాలని అహుడ సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం నగరంలోని అహుడ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించి అర్జీలను స్వీకరించారు.*

- *ఈ సందర్భంగా నారాయణపురం పంచాయతీలో ఎలైట్ అపార్ట్మెంట్ లో పార్కింగ్ స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ గా మారుస్తున్నారని, దానిపై తగిన చర్యలు తీసుకోవాలని అర్జీదారులు అర్జీ అందించారు. మార్ట్ గేజ్ పరిశీలన చేయాలని అర్జీ అందించారు. ఉప్పరపల్లిలో అనధికార లేఅవుట్ లో భవనం కడుతున్నారని, కక్కలపల్లి ఎల్ఆర్ఎస్ ఓపెన్ సైట్ ని వెరిఫై చేయాలని, ఎల్ఆర్ఎస్ అప్రూవల్ కావాలని అర్జీలు సమర్పించగా, అర్జీలను వేగంగా పరిష్కరించాలని అహుడ సెక్రటరీ ఆదేశించారు. పరిగి చుట్టుపక్కల పరిధిలో అనధికార లేఅవుట్లపై ప్రత్యేక డ్రైవ్ లు వేసి తనిఖీలు చేయాలని ఆదేశించారు.*

- *ఈ కార్యక్రమంలో అహుడ పిఓ ఇషాక్, ఇంజినీర్ దుష్యంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, జెపీఓ హరీష్ చౌదరి, డీఈ రేవంత్, సర్వేయర్ శరత్, తదితరులు పాల్గొన్నారు.*

4
213 views

Comment