* *ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF చెక్కులు పంపిణి చేసిన Dr. గొట్టిపాటి లక్ష్మీ.*
ఈరోజు దొనకొండ మండలంలోని 20 మందికి రూ : 10,03,284 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, మండల నాయకులు వివిధ హోదాలో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, కూటమి శ్రేణులు ఉన్నారు.