logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*రైతన్నలకు శుభవార్త – అన్నదాత సుఖీభవ* , *పీఎం కిసాన్ మూడో* *విడత* *నిధుల విడుదల

*రైతన్నలకు శుభవార్త – అన్నదాత సుఖీభవ* , *పీఎం కిసాన్ మూడో* *విడత* *నిధుల విడుదల* ....

👉 రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం ఆముదాలవలస పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ (పీయూసీ) చైర్మన్ *శ్రీ కూన రవికుమార్* గారు పాల్గొన్నారు.

👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు మాట్లాడుతూ రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. వ్యవసాయం దేశానికి వెన్నెముక అని పేర్కొంటూ రైతులు ఆర్థికంగా బలపడేలా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని చెప్పారు.

👉అందులో భాగంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద మూడో విడతగా ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి రూ.6,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నిధులు రైతులకు సాగు పనుల కోసం విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి ఉపయోగపడతాయని చెప్పారు.

👉రైతుల శ్రమకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతుల ఆదాయం పెంచడం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

👉 ఈ సందర్భంగా రైతన్నలకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన అగ్రికల్చర్ డ్రోన్లను ప్రారంభించడం జరిగింది.

👉ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారు,మాజీ ఎమ్మెల్సీ పి విశ్వ ప్రసాద్ గారు, నారాయణ పురం ప్రాజెక్ట్ చైర్మన్ సనపల డిల్లీ గారు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్ర శేఖర్ గారు, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు టి.సుజాత గారు,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, కూటమి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0
0 views

Comment