విద్యా సంవత్సరం ముగియక ముందే అడ్మిషన్లు ప్రారంభించిన ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు-PDSU రాష్ట్ర అధ్యక్షులు బొల్గూరి కిరణ్ కుమార్
నల్గొండ: AIMEDIA 13-03-2026 విద్యా సంవత్సరం ముగియక ముందే వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించిన ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు
PDSU రాష్ట్ర అధ్యక్షులు బొల్గూరి కిరణ్ కుమార్.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU ) నల్లగొండ జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక PDSU జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా PDSU తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ బొల్గూరి కిరణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ 2025-2026 విద్యా సంవత్సరం ఇంకా ముగించక ముందే కనీసం విద్యార్థుల పరీక్షలు ఇంకా జరగకముందే అప్పుడే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల, కళాశాలల యజమాన్యాలు ఇంటి ఇంటింటికి తిరుగుతూ, ప్రతి స్కూల్ వద్దకు తిరుగుతూ మా స్కూల్ మంచిదంటే మా స్కూల్ మంచిదని, మా కాలేజ్ మంచిది అంటే మా కాలేజ్ మంచిది అని కరపత్రాలతో పిఆర్ఓ లను పెట్టి మరియు తమ స్కూలు, కళాశాల సిబ్బందిని గ్రూపులు గ్రూపులుగా చేసి ప్రచార ఆర్భాటాలతో అడ్మిషన్స్ చేస్తున్నారు. వేల రూపాయల,లక్షల రూపాయల ఫీజులు చెప్పుతూ విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయంలోకి నెట్టి తమ పని కానిచ్చేస్తున్నారు. ఒక్కొక్క కళాశాల, పాఠశాల స్టాప్ కు కనీసం 10 అడ్మిషన్ల టార్గెట్ ఇస్తున్నారు. అలా చేస్తేనే మీ పోస్ట్ ఉంటుందని లేకపోతే ఇంకొకరు వస్తారని బెదిరింపులకు గురి చేస్తూ మరి అడ్మిషన్స్ కానిస్తున్నారు. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా, ఇష్టారాజ్యంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలకు, కళాశాలకు పర్మిషన్లు ఇచ్చినటువంటి విద్యాధికారులు వాటిని కట్టడి చేయడంలో, వాటిని నిలువరించడంలో పూర్తిగా విఫలమైనారు అని అన్నారు. ఒకపక్క ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నటువంటి అధిక ఫీజులను నియంత్రించలేని విద్యాధికారులు, మరోపక్క అక్రమ అడ్మిషన్లు కొనసాగిస్తున్నటువంటి పాఠశాల, కళాశాల యజమాన్యాలను కూడా నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వెంటనే విద్యాధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతూ అడ్మిషన్లు కొనసాగిస్తున్నటువంటి పాఠశాలల, కళాశాలల యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అట్టి కళాశాలల, పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని చట్టపరంగా శిక్షించాలని విద్యాధికారులను ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో ప్రచార ఆర్భాటాలు చేస్తూ అడ్మిషన్లు చేస్తున్నటువంటి పాఠశాల, కళాశాల క్యాంపెనింగ్ గ్రూపులను పట్టుకొని వారి కరపత్రాలను, ప్రచార సామాగ్రినీ ఎక్కడికక్కడ దగ్ధం చేస్తామని, వారిని నియంత్రిస్తామని అవసరమైతే ఎలాంటి దాడులకైనా వెనుకాడబొమని , విద్యార్థుల హక్కులను కాపాడుతామని కిరణ్ హెచ్చరించారు.ఈ సమావేశంలో PDSU జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ బొల్గూరి అనిల్ కుమార్, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి వర్కటపు సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు B. వినీత్, జిల్లా సహాయ కార్యదర్శి కన్నెబోయిన అంజిబాబు, జిల్లా కోశాధికారి సాయి, జిల్లా నాయకులు రవీందర్, విజయ్, గోపి, అజయ్, శివ, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.