*పంచాయతీ కార్యదర్శుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ*
పత్రికా ప్రకటన
మార్చి 13, 2026 – ఆదిలాబాద్
జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో పంచాయతీ కార్యదర్శుల సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు. అలాగే కార్యదర్శులు ఎదుర్కొంటున్న ఇతర పెండింగ్ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని విన్నవించారు.
ఈ అంశాలపై స్పందించిన కలెక్టర్, పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమని, వారు సమర్థంగా విధులు నిర్వహిస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు సంజీవరావు, ప్రధాన కార్యదర్శి అరుణ్ రెడ్డి, కోశాధికారి అనిల్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు నాగభూషణ్, ఉపాధ్యక్షులు వినోద్, చక్రవర్తి, జాయింట్ సెక్రటరీలు గంగన్న, దేవన్న, రాజేందర్, స్పోర్ట్స్ సెక్రటరీ వినయ్, సభ్యులు దుర్గయ్య, మహేందర్, రాహుల్, సంతోష్, అరుణ్, సునీల్ రెడ్డి తదితర పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.