logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రజలకు సహజ సిద్ధమైన గిరిజన ఉత్పత్తులు త్వరలో గిరి మాల్టులో లభ్యం *భద్రాచలం ఐటిడిఏ పిఓ బి రాహుల్,


తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** భద్రాచలం ఐటిడిఏ** మార్చి 13 **(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


ప్రజలకు సహజ సిద్ధమైన గిరిజన ఉత్పత్తులు త్వరలో గిరి మాల్టులో లభ్యం

*భద్రాచలం ఐటిడిఏ పిఓ బి రాహుల్,


భద్రాచలం, మార్చి 13:( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)సహజ సిద్ధమైన గిరిజన ఉత్పత్తులు, వాటి పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించి ప్రజలకు అత్యంత చేరువగా అందుబాటులో లభించేలా ప్రస్తుత ఉన్న గిరి బజారును భద్రగిరి మార్ట్ గా రూపకల్పన చేసి ఈనెల శ్రీరామనవమి పండుగనాడు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నందున సంబంధిత అధికారులు మీకు అప్పగించిన పనులను సోమవారం నాటికి పూర్తి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.
శుక్రవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో త్వరలో ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్ కి వివిధ నిత్యవసర వస్తువులు సేకరణకు నియమించబడ్డ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యూనిట్ అధికారుల వారీగా ఎస్ హెచ్ జి గ్రూపు మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల సహజ సిద్ధమైన ముడి సరుకులు మరియు గిరిజన రైతుల నుండి సేకరించవలసిన బియ్యం పప్పు ధాన్యాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కొన్ని సూచనలు లు మనం సేకరించే ప్రతి వస్తువు నాణ్యతగా మన్నికైనదిగా ఉండాలని ముఖ్యంగా తేనె మిల్లెట్ బిస్కెట్లు, పప్పుధాన్యాలు, వివిధ రకాల బియ్యం ఇతర గృహపకరణాలకు ఉపయోగపడే ప్రతి సరుకులు ఆర్గానిక్ సంబంధించినవే ఉండాలని అన్నారు. 88 ఎస్సిహెచ్జి మహిళా సంఘాలు మన గిరి ప్రొడక్ట్స్ అడవి ఫలాలు ప్రాచుర్యంలోకి తీసుకురావడమే కాక భద్రగిరి మార్ట్ కు వచ్చే వినియోగదారులకు సంతృప్తి చెందేలా చూడవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారూ. అనంతరం వ్యవసాయ శాఖ ఏడి మరియు డీఈవో, ఏఒ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని సూచనలు ఇస్తూ భద్రాచలంలో ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్ కి వ్యవసాయ శాఖ సహకారం తప్పనిసరిగా కావాలని, మీ పరిధిలో ఉండే గిరిజన రైతులు వారు సేంద్రియ ఎరువులతో పండించే వివిధ రకాల పంటలు మధ్య దళారుల పాలు కాకుండా నేరుగా భద్రగిరి మార్ట్ కి అమ్మకాలు జరిపేలా చూడాలని, అలాగే డైరీ ఫారం కు సంబంధించిన ఆవు నెయ్యి గేదె నెయ్యి తో పాటు నాటు కోడిగుడ్లు కూడా నాణ్యతగా ఉన్నది తప్పనిసరిగా తీసుకుంటామని, అందుకు సంబంధించిన డాటా సోమవారం నాటికి ఐటీడీఏ ఉద్యానవన అధికారికి అందించాలని అన్నారు. గిరిజన ఎస్ హెచ్ జి మహిళలకు మరియు రైతులకు ఆర్థికంగా చేయూత అందించడానికి ఏర్పాటు చేస్తున్న భద్రగిరి మార్ట్ కి తప్పనిసరిగా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఏవో సున్నం రాంబాబు, ఏపీవో పవర్ వేణు, ఏసీఎంవో రమేష్, పి వి టి జి అధికారి గనియ, డి ఎం జి సి సమ్మయ్య, డీఎస్ఓ ప్రభాకర్ రావు, జేడీఎం హరికృష్ణ, మేనేజర్ ఆదినారాయణ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

16
461 views

Comment