logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం:* *పరీక్షలు రాయబోయే విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్:* *జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.*

*పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం:*



*పరీక్షలు రాయబోయే విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్:*



*జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.*



(చంద్ర న్యూస్ :-నిర్మల్ జిల్లా బ్యూరో, 13 మార్చి 2026)



శనివారం నుంచి జరగబోయే పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని వివరించారు. పదవ తరగతి పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేస్తామని వెల్లడించారు.

పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులందరికీ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరుకావాలని అన్నారు. విద్యార్థులంతా సమయానికి పరీక్ష కేంద్రాల్లోనికి చేరుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

16
1605 views

Comment