రంజాన్ మాసం సందర్భంగా కోవూరులో పవిత్ర ఇఫ్తార్ విందు – టిడిపి యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి
రంజాన్ మాసం సందర్భంగా కోవూరు మండలంలో పవిత్ర ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించనున్నారు.
టిడిపి యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ రోజు, మార్చి 13 శుక్రవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు, కోవూరు పంచాయతీలోని మసీదు వీధిలో ఉన్న జామియా మసీదు వద్ద ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం సోదరులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.