logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జిల్లాలో వంట గ్యాస్ కొరత ఏమాత్రం లేదు:జిల్లా కలెక్టర్ రాజర్షిషా

పత్రిక ప్రకటన
మార్చి 13, 2026_ఆదిలాబాదు:



జిల్లాలో వంట గ్యాస్ కొరత ఏ మాత్రం లేదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు.

శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీనీ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సిలిండర్ల స్టాక్ వివరాలు, ఆన్లైన్ బుకింగ్, ఇతర అంశాలపై సమీక్షించి నిర్వాహకులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... సిలిండర్ల కొరతపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, జిల్లాలో మాత్రం ఎలాంటి కొరత లేదని వెల్లడించారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వెంటనే వినియోగదారులకు సిలెండర్ లను అందజేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
బ్లాక్ మార్కెట్ చేస్తే కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి డోర్ డెలివరీ సదుపాయం ద్వారా అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ ఏజెన్సీ ప్రతినిధులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఎలాంటి కొరత లేకుండా పౌరసరఫరా, రెవెన్యూ పోలీస్ శాఖలతో కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందనీ తెలిపారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది ఉన్నా 1800-425-1939 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించవచ్చని సూచించారు.

ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఎస్ఓ నందిని, తాహసిల్దార్ శ్రీనివాస్, ఎన్ఫోర్స్ మెంట్ డి.టి మహేష్, ఏజెన్సీ ప్రతినిధులు, ఇతర అధికారులు, వినియోగదారులు, తదితరులు పాల్గొన్నారు.

5
309 views

Comment