logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బెదిరింపులకు పాల్పడిన నలుగురిపై కేసు నమోదు, అరెస్ట్ సొసైటీ ద్వారా డబ్బులను తీసుకొని, తిరిగి చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడిన నలుగురు నిందితులు.

పత్రికా ప్రకటన
అదిలాబాద్ జిల్లా,
మార్చ్ 14 :-



తుడుం దెబ్బ పేరుతో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసిన నిందితులు.

ఆదివాసి నాయకులం అంటూ, డబ్బులు ఇవ్వకపోతే ధర్నా చేస్తామని బెదిరింపులకు పాల్పడిన నలుగురు

బాధితుడు ఆర్కే కోపరేటివ్ సొసైటీ చైర్మన్ కొండూరి రాకేందర్.

2 టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు

నిందితులు
A-1) సలాం వరుణ్ (27) @ సలాం ఆరుణ్ కుమార్ s/o దాము, ఆదివాసి స్టూడెంట్ యూనియన్ జిల్లా సెక్రటర్, నివాసం: రామ్నగర్, ఆదిలాబాద్ పట్టణం. (ఇదివరకే జైలు లో ఉన్నాడు)
A-2) వెట్టి మనోజ్, తండ్రి పేరు: జంగు, వయస్సు: 46 సంవత్సరాలు,
ఇంటి నం: 2-478, దుర్గానగర్, ఆదిలాబాద్. ( అరెస్ట్)
A-3) తుమ్రం ప్రభాత్ రావు, తండ్రి పేరు: షామ్దూర్ షా, వయస్సు: 34 సంవత్సరాలు,
దొడండ గ్రామం, ఇంద్రవెల్లి మండలం. (అరెస్ట్)
A-4) దుర్వ సుభాష్, రెంజర్ గ్రామం, బజార్హత్నూర్ మండలం. (అరెస్ట్)

ఆదిలాబాద్ పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెదిరింపులకు పాల్పడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు.

వివరాల్లోకి వెళితే, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆర్కే కోపరేటివ్ సొసైటీ చైర్మన్ కొండూరి రాకేందర్ మరియు సొసైటీ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రాగం రమేష్ లను 2024 సంవత్సరంలో కొంతమంది వ్యక్తులు బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆర్కే కోపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాల కోసం రూ.25,000 నుండి రూ.1,00,000 వరకు లోన్లు ఇచ్చి, వాటిని రెండు వాయిదాలలో తిరిగి చెల్లించే విధానం అమలులో ఉండేది. అయితే ఆర్థిక ఇబ్బందులు మరియు నష్టాల కారణంగా 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో సొసైటీని మూసివేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో గతంలో సొసైటీ ద్వారా లోన్లు తీసుకున్న ప్రభాతరావు, దుర్వాసుభాష్ వ్యక్తులు తిరిగి డబ్బులు చెల్లించకుండా, వెట్టి మనోజ్ మరియు సలాం వరుణ్ అనే వ్యక్తులు ఆదివాసి నాయకులమని చెప్పుకుంటూ “తుడుం దెబ్బ” పేరుతో బెదిరింపులకు పాల్పడి, డబ్బులు ఇవ్వకపోతే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అలాగే బాధితుల వద్ద నుంచి రెండు మూడు విడతలుగా ఒక్కోసారి రూ.20,000 చొప్పున డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అందులో నిందితులని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కేసు నందు ప్రభాతరావు, దుర్వాసుభాష్ సొసైటీ ద్వారా తలా సుమారు లక్ష రూపాయల వరకు లోన్లు తీసుకుని తిరిగి చెల్లించకుండా, 2024 సంవత్సరం నుండి బాధితులను వివిధ రకాలుగా వేధిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ప్రజలు ఎవరైనా వ్యక్తులచే బెదిరింపులు, అక్రమ వసూళ్లు లేదా ఇలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు.

0
66 views

Comment